చిరంజీవి జనసేనలో చేరుతాడా


will chiranjeevi join hands with pawan kalyans janasenaమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాల మీదే పెట్టాడు కానీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మాత్రం తమ్ముడికి అండగా నిలబడటానికి జనసేన పార్టీలో చేరొచ్చని తెలుస్తోంది , ఒకవేళ పార్టీలో చేరకపోయినా మద్దతు మాత్రం జనసేన కు ఇచ్చేలా కనిపిస్తోందని అంటున్నారు . ఎందుకంటే 2009 లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఎన్నికల్లో పాల్గొన్నాడు చిరంజీవి కానీ ప్రజలు చిరు అండ్ కో కు దిమ్మతిరిగేలా సమాధానం ఇవ్వడంతో పట్టుమని 17 స్థానాలను కూడా గెల్చుకోలేకపోయాడు దాంతో ప్రజారాజ్యం దుకాణం మూసేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన విషయం తెల్సిందే .

ఇక ఆ గొడవ ముగిసింది కాబట్టి ఇప్పుడు సినిమాలపై దృష్టి పెట్టాడు అయితే ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి ఈలోపు సినిమా చేసి ఎన్నికల సమయంలో ఎలాగూ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో కొంతవరకు అంచనా వస్తుంది కాబట్టి ఆ సమయానికి జనసేన తీర్థం పుచ్చుకోవడం లేదంటే జనసేన కు మద్దతు ఇవ్వడం చేయనున్నాడట చిరంజీవి . కొంతకాలం క్రితం చిరు కి పవన్ కు మధ్య విబేధాలు ఉండేవి కానీ ఇప్పుడు ఇద్దరు కూడా కలిసి మెలిసి తిరుగుతున్నారు . జనసేన పట్ల కొంత అనుకూల వాతావరణం అయితే ఉంది కానీ అది కొన్ని సీట్లు మాత్రమే సాధించేలా ఉంది దాంతో చిరు మేనియా తోడైతే కొంత బెటర్ రిజల్ట్ వస్తుందని భావిస్తున్నారట .

English Title: will chiranjeevi join hands with pawan kalyans janasena