నాగార్జున – నాని హిట్ కొడతారా


Will devadas gets positive talk

నాగార్జున , నాని కాంబినేషన్ లో దేవదాస్ అనే మల్టీస్టారర్ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు విడుదల అయ్యింది. నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ నటించగా నాని సరసన రష్మీక మందన్న నటించింది. వినోద ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రంపై అటు నాగార్జున ఇటు నాని ఇద్దరు కూడా భారీగా ఆశలు పెట్టుకున్నారు. పైగా మల్టీస్టారర్ చిత్రం కావడంతో ఇద్దరు హీరోలు కూడా టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే హిట్ అయితే ఫరవాలేదు కానీ ప్లాప్ అయితే మాత్రం ఇద్దరి ఇమేజ్ కి సంబంధించిన విషయం కాబట్టి ఇద్దరు కూడా టెన్షన్ పడుతున్నారు.

దేవదాస్ చిత్రం పై పెద్దగా అంచనాలు లేవు . దానికితోడు పెద్దగా పబ్లిసిటీ కూడా చేయలేదు దాంతో దేవదాస్ చిత్రానికి క్రేజ్ లేకుండా పోయింది. కాకపోతే కాస్త ఎట్రాక్షన్ గా హాట్ భామ రష్మీక మందన్న నిలిచింది ఈ దేవదాస్ చిత్రానికి. ఛలో చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామకు అది హిట్ కావడంతో గీత గోవిందం వచ్చింది ఇక గీత గోవిందం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రం కాపీ కొట్టిన బాపతు అని తెలుస్తోంది కానీ దర్శకుడు మాత్రం కాపీ కాదని అంటున్నాడు. ఇక ఇది కాపీనా ? కాదా ? అన్నది ఈరోజు తేలిపోనుంది. అలాగే ఈ సినిమా హిట్ అవుతుందా ? ప్లాప్ అవుతుందా అన్నది కూడా తేలిపోయేది కూడా ఈరోజే .

English Title: Will devadas gets positive talk ?