పంతంతో గోపీచంద్ హిట్ కొడతాడా


will gopichand gets hit with panthamగోపీచంద్ హీరోగా నటించిన ” పంతం ” చిత్రం జులై 5న విడుదల అవుతోంది , అయితే ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు గోపీచంద్ . గతకొంత కాలంగా గోపీచంద్ నటించిన చిత్రాలన్నీ వరుసగా ప్లాప్ అవుతున్నాయి అంతేకాదు నిర్మాతలకు, బయ్యర్ల కు కూడా భారీ నష్టాలను మిగిల్చాయి కూడా దాంతో పంతం పై ఆశలు పెట్టుకున్నాడు . ఇక ఆమధ్య విడుదలైన పంతం ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచింది . దాంతో నిర్మాత కూడా నమ్మకంగా ఉన్నాడు అలాగే బయ్యర్లు కూడా .

చక్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ”పంతం ” చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించారు . కరెంట్ ఇష్యూ తో రూపొందిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఏది లేకపోవడంతో హిట్ అవుతుందేమో అన్న ఆశ నెలకొంది . జులై 5న పంతం విడుదల అవుతుండగా ఆ మరుసటి రోజున సాయి ధరమ్ తేజ్ నటించిన ” తేజ్ ఐ లవ్ యు ” చిత్రం విడుదల అవుతోంది ఇక నిన్న విడుదలైన పది చిత్రాల్లో ఏది కూడా హిట్ అయ్యే సూచనలు కనిపించడం లేదు కాస్త ఈ నగరానికి ఏమైంది చిత్రం మాత్రమే కొంతవరకు బెటర్ దాంతో గోపీచంద్ కు ఎదురు లేకుండా పోయింది కాబట్టి పంతం తో హిట్ కొట్టాలి లేదంటే ఈ హీరో కెరీర్ డైలమాలో పడినట్లే !ఇక నిర్మాత కేకే రాధామోహన్ కూడా హిట్ కొట్టాలి గతకొంత కాలంగా ఈ నిర్మాత నిర్మిస్తున్న చిత్రాలు కూడా ప్లాప్ అవుతున్నాయి లేదంటే ఎక్కువ బడ్జెట్ తో ఇబ్బంది పడుతున్నాడు .