ఎన్టీఆర్ ఆ సినిమాలో నటిస్తాడా ?

Jr.Ntr
Jr.Ntr

ఈరోజుల్లో పౌరాణిక చిత్రాల్లో నటించాలంటే ఇప్పుడున్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే సరిగ్గా సరిపోతాడు పైగా పౌరాణిక , చారిత్రాత్మక పాత్రలను పోషించాలని తహతహలాడుతున్నాడు కూడా . దాంతో అల్లు అరవింద్ మధు మంతెన , నమిత్ మల్హోత్రా లతో కలిసి నితీష్ తివారి , రవి ఉద్యవార్ ల దర్శకత్వంలో నిర్మించనున్న ” రామాయణ ” చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తే బాగుంటుందని నెటిజన్లు భావిస్తున్నారు .

జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా అలాగే రావణాసురుడు గా నటిస్తే బాగుంటుందని లేదంటే …… రావణాసురుడు పాత్రలో నటించినా అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నారు . అయితే వాళ్ళు ఎన్టీఆర్ ని సంప్రదించాలి అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోవాలి ఇంత తతంగం ఉంది మరి . ఒప్పుకొని రామాయణ చిత్రంలో నటిస్తాడా ఎన్టీఆర్ ? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న .