కాలా ప్రభంజనం సృష్టించబోతోందా


will kaala create new sensation on june 7 th సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ” కాలా ” చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 7న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది . పా రంజిత్ దర్శకత్వంలో రజనీ అల్లుడు హీరో ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించాడు . రజనీకాంత్ సరసన ఈశ్వరీ రావు , హుమా ఖురేషి నటించగా కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు నానా పటేకర్ నటించాడు . ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో స్లమ్ ఏరియా వ్యక్తిగా , డాన్ గా నటించాడు రజనీకాంత్ .

రజనీకాంత్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే . దాంతో మొదటి రోజున ప్రభంజనం సృష్టించడం ఖాయమని నమ్ముతున్నారు ఆ చిత్ర బృందం . వరల్డ్ వైడ్ గా అత్యధిక భాషలలో అలాగే అత్యధిక కేంద్రాల్లో విడుదల అవుతుంది కాబట్టి మొదటి రోజున వసూళ్ల సునామి సృష్టించడం ఖాయం గా కనిపిస్తోంది . జూన్ 7న ఏం జరగబోతోంది అంటే ” కాలా ” ప్రభంజనం అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు . అయితే గతకొంత కాలంగా రజనీకాంత్ చిత్రాలన్నీ అంచనాలను తల్లకిందులు చేస్తూ పరాజయం పాలౌతున్నాయి . దాంతో బయ్యర్లలో కొంతమంది ఏమౌతుందో ? అదృష్టం ఎలా ఉందో అని భయపడుతున్నారు . రజనీకాంత్ కున్న క్రేజ్ దృష్ట్యా మొదటి రోజున ప్రభంజనం సృష్టించడం అయితే ఖాయం , ఇక సినిమా బాగుంటే ఆ జోరు కొనసాగుతుంది లేదంటే షరా మాములే !