హిందీ అర్జున్ రెడ్డి సంచలనం సృష్టిస్తుందా ?


Kabir singh
Kabir singh

తెలుగునాట సంచలన విజయం సాధించి విజయ్ దేవరకొండ ని స్టార్ హీరోని చేసిన చిత్రంఅర్జున్ రెడ్డి ” . తెలుగులో ప్రభంజనం సృష్టించడంలో ఈ చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా . షాహిద్ కపూర్కియారా అద్వానీ జంటగా నటించిన కబీర్ సింగ్ ఈనెల 21న అంటే మరో రెండు రోజుల్లో విడుదలకు సిద్ధమైంది

ఇక ఓవర్ సీస్ లో రేపే విడుదల అవుతోంది కబీర్ సింగ్ . తెలుగులో సంచలనం సృష్టించినట్లుగానే హిందీలో కూడా ఈ చిత్రం ప్రభంజనం సృస్టించనుందా ? ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న ఇదే . బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి కంటెంట్ తో పాటుగా షాహిద్ కపూర్ నటన కియారా అద్వానీ గ్లామర్ హైలెట్ గా నిలవనున్నాయి . ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతోందో మరో రెండు రోజుల్లో తెలిసిపోనుంది