జూనియర్ హీరోకు లిప్ లాక్ ఇస్తుందా


will kajal agarwal give lip lock to vijay devarakonda

విజయ్ దేవరకొండ అంటే కిస్సుల హీరో అది కూడా లిప్ లాక్ చేసే హీరో అన్న విషయం తెలిసిందే . అయితే ఆ హీరో తో తాజాగా సీనియర్ హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ నటించనున్నట్లు తెలుస్తోంది . అగ్ర నిర్మాత కేఎస్ రామారావు క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు కాగా ఆ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరో కాగా హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేస్తున్నట్లు గా తెలుస్తోంది . విజయ్ దేవరకొండ సినిమా అంటే లిప్ లాక్ లకు కొదవ ఉండదు మరి కాజల్ అగర్వాల్ విజయ్ దేవరకొండ కు ఘాటు లిప్ లాక్ ఇస్తుందా ? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న .

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ప్రవేశించి అప్పుడే పదేళ్లు అయిపొయింది పదకొండో సంవత్సరం కావస్తోంది ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి . ఇక విజయ్ దేవరకొండ చాల రోజులుగా ఇండస్ట్రీ లో ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎవడే సుబ్రహ్మణ్యం తోనే కాస్త గుర్తింపు లభించింది . పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి చిత్రాలతో స్టార్ డం అందుకున్నాడు . తాజాగా టాక్సీ వాలా , గీత గోవిందం , నోటా చిత్రాలతో బిజీ గా ఉన్నాడు . గీత గోవిందం చిత్రం ఆగస్టు లో విడుదల అవుతుండగా టాక్సీ వాలా ఎప్పుడు వస్టుందో తెలియడం లేదు . త్వరలోనే క్రాంతి మాధవ్ చిత్రంలో నటించనున్నాడు విజయ్ దేవరకొండ .

English Title: will kajal agarwal give lip lock to vijay devarakonda