చిరు చిన్నల్లుడు హీరోగా సక్సెస్ అవుతాడా


will kalyan dhev get success with vijethaమెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా రంగప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే . రాకేశ్ శశి దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మిస్తున్న విజేత చిత్రాన్ని జూలై లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . కాగా ఈరోజు విజేత టీజర్ ని విడుదల చేసారు . టీజర్ చూస్తుంటే కళ్యాణ్ దేవ్ యాక్షన్ ని కాకుండా సాఫ్ట్ లవ్ స్టొరీ లను నమ్ముకున్నట్లు తెలుస్తోంది . యాక్షన్ హీరోగా ట్రై చేస్తే సమస్య వస్తుంది కాబట్టి ముందుగా లవ్ సబ్జెక్ట్ తోనే ఎంట్రీ ఇవ్వాలని భావించినట్లున్నాడు .

చిరు చిన్న కూతురు శ్రీజ ని కళ్యాణ్ దేవ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . ఇక టీజర్ లో కళ్యాణ్ బాగానే కనబడుతున్నాడు అలాగే ఫేస్ ఫీలింగ్స్ కూడా బాగానే ఉన్నాయి మరి . రేపు పూర్తీ సినిమా విడుదల అయ్యాకే తెలుస్తుంది కళ్యాణ్ దేవ్ నటన ఎలా ఉందో . మెగా క్యాంప్ నుండి ఇప్పటివరకు చాలామంది హీరోలు వచ్చారు , అందులో మాగ్జిమం హిట్స్ కొట్టారు మరి కళ్యాణ్ దేవ్ హిట్ కొట్టి హీరోగా సక్సెస్ అవుతాడా ? లేదా ? . విజేత చిత్రం చిరంజీవి కెరీర్ లో మైలురాయి గా నిలిచింది , మరి అదే పేరుతో వస్తున్న ఈ చిత్రం కళ్యాణ్ దేవ్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో .