మహర్షి హిట్ అవుతుందా ?


Maharshi Movie Poster
Maharshi Movie Poster

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి మే 9 న విడుదల అవుతున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రం హిట్ అవుతుందా ? మహేష్ కు ప్లస్ అవుతుందా అన్న చర్చ సాగుతోంది . ఎందుకంటే వంశీ పైడిపల్లి ఇంతవరకు దర్శకత్వం వహించిన చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ లేకపోవడం ఒకటైతే పూజా హెగ్డే కూడా కూడా సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇంతవరకు పడలేదు . ఇక అల్లరి నరేష్ అయితే గత ఏడేళ్లుగా పరాజయాల బాటలోనే పయనిస్తున్నాడు .

దానికి తోడు మహర్షి సినిమాకు సంబందించిన ప్రోమోస్ అన్ని కూడా శ్రీమంతుడు 2 లాగా అనిపిస్తున్నాయి తప్ప కొత్త కోణం కనిపించడం లేదు దాంతో మహర్షి చిత్ర విజయం పై నీలినీడలు కమ్ముకున్నాయి . అలాగే ఈ సినిమా విడుదల ఇంకా పదిరోజుల సమయం కూడా లేదు కానీ పెద్దగా చర్చ కూడా సాగడం లేదు మహర్షి గురించి దాంతో ఈ సినిమా విజయం సాధిస్తుందా ? మహేష్ కు హిట్ నిస్తుందా ? అన్న టెన్షన్ మహేష్ అభిమానుల్లో నెలకొంది . ఏది ఏమైనా మహర్షి సినిమా బాగుందని టాక్ వస్తే రికార్డుల మోత మోగడం ఖాయం , టాక్ డివైడ్ అయితేనే సమస్య .