మహేష్ 100 కోట్లు రాబట్టగలడా ?


Maharshi Collections
Maharshi Movie Poster

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి చిత్రంతో మూడు రోజుల్లో 100 కోట్ల గ్రాస్  50 కోట్ల షేర్ రాబట్టాడు . అయితే మహర్షి చిత్రాన్ని కొన్న బయ్యర్లు సేఫ్ కావాలంటే 100 కోట్లకు పైగా షేర్ రాబట్టాలి అప్పుడే పెట్టిన పెట్టుబడి వస్తుంది . ప్రస్తుతానికి 50 కోట్లకు పైగా రాబట్టాడు కాబట్టి మిగతా సొమ్ము ఎంత త్వరగా రాబడితే బయ్యర్లు అంత త్వరగా సేఫ్ జోన్ లోకి వెళ్తారు . అయితే ఏ సినిమాకైనా ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి సినిమా బాగుంటే ఆ జోరు కొనసాగుతుంది లేకపోతే కలెక్షన్లు పడిపోతాయి .

మహర్షి చిత్రానికి పూర్తిగా పాజిటివ్ టాక్ అయితే లేదు మిక్స్డ్ టాక్ ఉంది దాంతో మిగతా సొమ్ము అంత స్పీడ్ గా రాదు . అయితే మహేష్ బాబు కున్న క్రేజ్ తో ఇప్పటికి కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి మహర్షి చిత్రానికి . దరిదాపుల్లో మరే పెద్ద సినిమా కూడా లేదు కాబట్టి ఈ వారం రోజుల్లో మహేష్ మరిన్ని మెరుగైన వసూళ్లు రాబట్టాలి అప్పుడే బ్రేక్ ఈవెన్ అవుతుంది లేదంటే కొంతమంది బయ్యర్లు బలికాక తప్పదు . వంద కోట్ల షేర్ కి యాభై కోట్ల దూరంలో ఉంది మహర్షి !