రంగస్థలం ని మహేష్ బద్దలు కొట్టలేడా ?


Will mahesh beat rangasthalam recordsమహేష్ బాబు తాజా చిత్రం భరత్ అనే నేను భారీ వసూళ్లు సాధిస్తోంది కానీ అనుకున్న స్థాయిలో మాత్రం రికార్డుల మోత మోగడం లేదు. చరణ్ నటించిన రంగస్థలం బ్లాక్ బస్టర్ కావడంతో దాన్ని మించి హిట్ అవుతుందని అనుకున్నారు మహేష్ బాబు అభిమానులు. అయితే రంగస్థలం 200 కోట్ల క్లబ్ లో చేరింది కానీ భరత్ అనే నేను మాత్రం 200 కోట్ల క్లబ్ లో చేరడం అనుమానంగానే ఉంది.

ప్రస్తుతం 160 కోట్ల వసూళ్ల ని సాధించాడు మహేష్ . రెండు భారీ పరాజయాలు బ్రహ్మోత్సవం , స్పైడర్ ల తర్వాత వచ్చిన ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో మహేష్ తో పాటుగా మహేష్ అభిమానులు కూడా చాలా సంతోషపడ్డారు. చరణ్ నటించిన రంగస్థలం ని మించి హిట్ అవుతుందని అనుకున్నారు కానీ ఆ స్థాయి వసూళ్లు మాత్రం రావడం లేదు భరత్ అనే నేను చిత్రానికి . నాన్ బాహుబలి చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది రంగస్థలం చిత్రం . అయితే ఆ రికార్డ్ ని భరత్ అనే నేను అందుకోవడం కష్టమే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే నాన్ బాహుబలి చిత్రాల్లో రంగస్థలం చిత్రం తర్వాతి స్థానంలో నెంబర్ 2 గా నిలిచేలా ఉంది మహేష్ భరత్ అనే నేను .