మహేష్ 200 కోట్లు వసూల్ చేస్తాడా


will mahesh joins 200 crores club with bharath ane nenu మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతున్న విషయం తెలిసిందే . కాగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి దాంతో మొదటి రోజు రికార్డ్ ఎలాగూ మహేష్ వశం అవుతుంది కాకపోతే ఓవరాల్ గా మహేష్ 200 కోట్ల పైచిలుకు వసూళ్ల ని సాధించి , చరణ్ రంగస్థలం రికార్డ్ ని బద్దలుకొట్టి  నాన్ బాహుబలి చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలుస్తాడా అన్నది చూడాలి .
మహేష్ నటించిన బ్రహ్మోత్సవం , స్పైడర్ చిత్రాలు ఘోర పరాజయం పొంది మహేష్ తో పాటుగా మహేష్ అభిమానులను కూడా కలవరానికి గురిచేసింది . దాంతో ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు పైగా అపజయమెరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో మరింతగా అంచనాలు పెరిగాయి . సినిమా బాగుంటే శ్రీమంతుడు చిత్రంలా మిగతా చిత్రాల రికార్డులను బద్దలు కొట్టడం మహేష్ సులువైన పనే ! 200 కోట్ల పై చిలుకు వసూళ్ల ని సాధిస్తే నాన్ బాహుబలి చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలుస్తుంది మరి ఆ రికార్డ్ మహేష్ అందుకుంటాడా చూడాలి .