సీడెడ్ లో ఇంకా 3 కోట్లు రాబట్టగలడా ?


మహేష్ బాబు నటించిన మహర్షి రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్లనే సాధిస్తోంది . ఇక తెలంగాణలో అయితే లాభాలు తెచ్చిపెడుతోంది మహర్షి కానీ సీడెడ్ లో మాత్రం లాభాలు రావాలంటే మరో 3 కోట్ల షేర్ రాబట్టాలి మహేష్ బాబు , మరి 3 కోట్ల షేర్ రాబట్టగలడా ? అన్నది సవాల్ గా మారింది . 12 కోట్ల షేర్ వస్తే బయ్యర్లు సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్లే ఇప్పటికే 9 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది మహర్షి . అంటే మరో 3 కోట్లు రాబడితే తెలుగు రాష్ట్రాలలో మహర్షి మహ సూపర్ హిట్ అనే చెప్పాలి .

అయితే ఓవర్ సీస్ లో మాత్రం నష్టం ఖాయమైపోయింది ఎప్పుడో ! అక్కడ 15 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చేలా కనబడుతున్నాయి దాంతో అక్కడి బయ్యర్ కు భారీ నష్టం తప్పడం లేదు . ఇక ఆంధ్రప్రదేశ్ లోని మిగతా ఏరియాలు అలాగే కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో మంచి వసూళ్లు రాబడుతోంది మహర్షి . సీడెడ్ లో కూడా మరో మూడు కోట్లు రాబట్టగలిగితే ఒడ్డున పడ్డట్లే ! భారీ ఓపెనింగ్స్ సాధించి మహేష్ స్టామినా తెలియజేసింది మహర్షి కానీ 140 కోట్ల భారీ బడ్జెట్ పెట్టడమే మహర్షి చేసుకున్న పాపం ! తక్కువ బడ్జెట్ తో చేసి ఉంటే తప్పకుండా బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి ఎందుకంటే 100 కోట్ల షేర్ దిశగా దూసుకుపోతోంది మహర్షి .