బావ గెలుపు కోసం ట్వీట్ కూడా చేయవా మహేష్ ?


Maheshbabu-gallajayadev
గుంటూరు పార్లమెంట్ స్థానం నుండి తెలుగుదేశం పార్టీ తరుపున గల్లా జయదేవ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . గల్లా జయదేవ్ హీరో మహేష్ బాబు కి బావ అన్న విషయం విదితమే ! అయితే గత ఎన్నికల సమయంలో బావ ని గెలిపించండి మంచి విజన్ ఉన్న నాయకుడు అంటూ ట్వీట్ చేసిన మహేష్ బాబు ఇప్పుడు మాత్రం బావ కోసం ట్వీట్ చేయకుండా సైలెంట్ అయిపోయాడు . 
 
మహేష్ బాబు ఎలాగూ బావ కోసం ప్రచారం చేసింది లేదు , ఇక ముందు కూడా చేసేది లేదు కనీసం ట్వీట్ అయినా చేస్తే ఓహో ! బావకు గట్టిగానే సపోర్ట్ చేస్తున్నాడే అని ఓ మాట అయినా అనుకుంటారు కదా ! కానీ మహేష్ మాత్రం ఇప్పటివరకు ట్వీట్ చేయలేదు . ఈరోజు ఏప్రిల్ 8 , ప్రచారం రేపటితో పరిసమాప్తం అవుతుంది ఏప్రిల్ 11న పోలింగ్ జరుగనుంది . మే 23 న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి . 
 
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం చూస్తే జగన్ హవా నే కనిపిస్తోంది , ఎన్నికల పోలింగ్ నాటికి పరిస్థితి మారినా మారొచ్చు . మహేష్ బావ మళ్ళీ గుంటూరు ఎంపీ గా గెలుస్తాడా ? లేదా ? అన్నది మే 23 నే తేలనుంది .