మహేష్ అల్లు అరవింద్ కు సినిమా చేస్తాడా

will mahesh tie up with allu aravind మహేష్ బాబు తో అల్లు అరవింద్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే అల్లు అరవింద్ కు మహేష్ బాబు సినిమా చేస్తాడా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న . ఎందుకంటే అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఈమధ్య మిగతా హీరోలతో సినిమాలు అంటూ ప్లాన్ చేస్తున్నాడు కానీ ఇంతకుముందు ఇతర హీరోలతో పెద్దగా సినిమాలు చేయలేదు ఇక చేసిన కొన్ని చిత్రాలు కూడా సొంతగా కాకుండా ఇద్దరు ముగ్గురు నిర్మాతలతో కలిసి సినిమాలు చేసాడు .

సోలోగా చిరంజీవి తోనే ఎక్కువ సినిమాలు చేసాడు అల్లు అరవింద్ . అయితే ఈమధ్య అల్లు అరవింద్ ట్రెండ్ మార్చాడు సొంత ఇంట్లోని హీరోలతోనే సినిమాలు చేస్తే లాభం లేదనుకున్నాడో ఏమో కానీ బయటి హీరోలతో కూడా సినిమాలు చేయాలనీ డిసైడ్ అయ్యాడట ! అందులో భాగంగానే మహేష్ బాబు తో సినిమా అని ఫీలర్లు వదిలినట్లున్నారు . అయితే మహేష్ కూడా ఫలానా నిర్మాతకే సినిమా చేస్తాను అని నియమం ఏది పెట్టుకోలేదు కాబట్టి కథ కుదిరితే ఉండొచ్చు కానీ అది ఇప్పట్లో మాత్రం ఉండే సినిమా అయితే కాదు .