భక్త కన్నప్ప గా మంచు విష్ణు మెప్పిస్తాడా ?


1976 లో విడుదలైన భక్త కన్నప్ప సంచలన విజయం సాధించి రెబల్ స్టార్ కృష్ణంరాజు కెరీర్ లోనే ల్యాండ్ మార్క్ గా నిలిచింది . కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత ఆ చిత్రాన్ని ఇప్పుడున్న టెక్నాలజీ తో మళ్ళీ తీయడానికి గత ఐదారేళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి . ఆ ప్రయత్నాలు అంతగా సాగలేదు కానీ మంచు విష్ణు మాత్రం కన్నప్ప గా నటించడానికి ఉత్సాహం చూపిస్తూనే ఉన్నాడు .

తాజాగా న్యూజిలాండ్ వెళ్లిన మంచు విష్ణు అక్కడ కన్నప్ప కోసం ఎలాంటి ప్రదేశాలు అయితే బాగుంటుందో సెలెక్ట్ చేసే పనిలో పడ్డాడు . భక్త కన్నప్ప అంటే టక్కున గుర్తుకు వచ్చేది కృష్ణంరాజు , అయితే ఇప్పుడు ప్రభాస్ ఆ పాత్ర పోషిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ సక్సెస్ కోసం కన్నప్ప గా నటించడానికి ముందుకు వచ్చాడు మంచు విష్ణు . మరి మంచు విష్ణు కన్నప్పగా మెప్పిస్తాడా ? ప్రేక్షకులను అలరిస్తాడా ? హిట్ కొడతాడా ? అంటే మిలియన్ డాలర్ల ప్రశ్నే !