మారుతి మార్క్ మ్యాజిక్ – “ప్రతిరోజు పండగే”


Will maruthi recreates his magic
Will maruthi recreates his magic

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా, టాలెంట్ తో  ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర దర్శకులలో ఒకరుగా నిలిచారు మారుతి. బస్ స్టాప్ & ఈ రోజుల్లో లాంటి చిన్న సినిమాలతో పెద్ద హిట్ లు సాధించి ఇప్పుడు తనదైనా మార్క్ హీరోఇజం మరియు కథలతో వరుస విజయాలు నమోదు చేస్తున్నారు మారుతి. ఎవరైనా హీరోని గొప్ప చూపిస్తారు, కానీ మారుతి తన కథలలో హీరోకి ఒక చిన్న బలహీనత పెట్టి, దానికంటూ ఒక లాజిక్ తో కథలో ఇందే అన్ని ఎమోషన్స్ కి లింక్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్ ని మన గుండెల్లోకి తోసేస్తాడు.

తాజాగా మారుతీ “ప్రతిరోజూ పండగే” సినిమాతో మాన్ ముందుకు వస్తున్నాడు. సుప్రీం హీరో సాయి ధరం తేజ్ & రాశీ ఖన్నా హీరో, హీరోయిన్స్ గా తమిళ్ సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రావు రమేష్, నరేష్ లాంటి ఎందఱో సీనియర్ నటులు కనిపిస్తున్నారు. ఇక ఈ కథ విషయానికి వస్తే,

హీరో తాతకు లాంగ్ క్యాన్సర్ తో ఇక గట్టిగా 5 వారాలకు మించి బతకడు అంటారు డాక్టర్లు. విదేశాలలో సెటిల్ అయిన ఆయన కొడుకులు ఆయన చనిపోకముందే, కార్యక్రమాలు ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆలోచిస్తూ ఉంటారు. ఇక అదే టైం లో ఎంట్రీ ఇస్తాడు ముద్దుల మనవడు. ఆఖరి రోజుల్లో తాత చేయ్యలనుకున్నవి, చూడలనుకున్నవి చేయించి అసాలు ఈ మనిషికేనా డాక్టర్లు చనిపోతారని చెప్పింది.? అని అనుకునేల చేస్తాడు. ఇక మనోడి లవర్ రాజమండ్రి బుజ్జి తో లవ్ స్టోరీ ఇంకొక ట్రాక్.

 

మారుతీ సినిమాలు కామెడీని పండిస్తూనే, గుండె లోతుల్లో ఉన్న ఎమోషన్స్ గురించి ఎంతో గంభీరమైన ఆలోచనలు కలిగేలా చేస్తాయి. ఇక ఆ ఆలోచనలకు సత్యరాజ్ & రావు రమేష్ లాంటి నటులు తోడైతే ఇక తిరుగుండదు. మరికొద్ది రోజుల్లో మన ముందుకు వచ్చే “ప్రతిరోజు పండగే” సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుందాం.