మెగా హీరో విలన్ గా నటిస్తే ఒప్పుకుంటారా ?Will mega fans accepts Varun tej's negetive role
Varun Tej

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా ఇప్పుడిప్పుడే వరుస విజయాలు సాధిస్తున్నాడు అయితే సడెన్ గా ఓ సంచలన నిర్మయం తీసుకున్నాడు . తమిళ రీమేక్ చిత్రంలో విలన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు , ఈ తమిళ రీమేక్ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నాడు . రష్మిక మందన్న హీరోయిన్ గా నటించే ఈ చిత్రంలో హీరో ఎవరు అన్నది డిసైడ్ కాలేదు ఇంకా .  అయితే ఈ మెగా హీరో విలన్ గా నటిస్తే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి అలాగే మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి . ముకుంద చిత్రంతో హీరోగా పరిచయమైన వరుణ్ తేజ్ కు కంచె చిత్రం మంచి బేస్ మెంట్ వేసింది .

దాని తర్వాత లోఫర్ , మిస్టర్ చిత్రాలు ప్లాప్ అయినప్పటికీ ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు ఆ తర్వాత తొలిప్రేమ చిత్రంతో మరో హిట్ కొట్టాడు . కట్ చేస్తే ఇప్పుడు అంతరిక్షం చిత్రంతో హ్యాట్రిక్ కోసం సిద్ధం అవుతున్నాడు . కెరీర్ మంచి జోరు మీదున్న ఈ సమయంలో విలన్ గా నటించడం అంటే మెగా ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి . అయితే నటుడిగా రకరకాల పాత్రలు పోషించినప్పుడే వరుణ్ ప్రతిభ మరింత వెలుగులోకి వస్తుంది .

English Title: Will mega fans accepts Varun tej’s negetive role