శైలజారెడ్డి అల్లుడు 40 కోట్లు సాధించగలడా


will nagachaitanya join 40 crore club ?అక్కినేని నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” శైలజారెడ్డి అల్లుడు ” . ఈనెల 13న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కాగా ఈ చిత్ర బిజినెస్ 24 కోట్లు కావడంతో 24 కోట్ల షేర్ శైలజారెడ్డి అల్లుడు అలియాస్ నాగచైతన్య సాధించగలడా ? అన్న ఆసక్తి నెలకొంది . 24 కోట్ల షేర్ రావాలంటే 40 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించాలి ఇంతవరకు నాగచైతన్య నటించిన చిత్రాలేవీ 40 కోట్ల గ్రాస్ ని సాధించలేదు దాంతో ఈ అనుమానం .

అయితే ఈ సినిమా వినోదాత్మకంగా రూపొందడంతో తప్పకుండా 40 కోట్ల గ్రాస్ వసూళ్లని 24 కోట్ల షేర్ ని సాధించడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం . అత్తా -అల్లుడు నేపథ్యంలో రూపొందిన చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి 80- 90 వ దశకంలో . అయితే పాత ఫార్మేట్ లో మాత్రం మా సినిమా ఉండదని అంటున్నాడు దర్శకులు మారుతి . నాగచైతన్య సరసన అనుపమా పరమేశ్వరన్ నటించగా కీలక పాత్రలో రమ్యకృష్ణ నటించింది . ప్రేమకథ కు వినోదాన్ని పంచిన చిత్రం కాబట్టి తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు . ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చితే తప్పకుండా పెద్ద హిట్ ని చేసి 40 కోట్లని కట్టబెట్టడం పెద్ద సమస్య కాదు .

English Title: will nagachaitanya join 40 crore club ?