నాగార్జున అతడికి న్యాయం చేస్తాడా


will nagarjuna do justice writer p jayakumarనాగార్జున రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆఫీసర్ . కాగా ఆ చిత్ర కథ నాదే అంటూ యువ రచయిత జయకుమార్ ఆరోపించడమే కాకుండా ఆఫీసర్ తాలూకు కథ ఏంటో మొత్తం రివీల్ చేసాడు అంతేకాదు నాగార్జున ని న్యాయం చేయమంటూ ట్విట్టర్ సాక్షిగా వేడుకున్నాడు అయితే నాగార్జున ఇప్పటివరకు ఆ విషయంపై స్పందించలేదు . వర్మ అమితాబ్ బచ్చన్ తో సర్కార్ 3 సినిమా చేస్తున్న సమయంలో నేను ఆఫీసర్ స్క్రిప్ట్ రాసి వర్మ కు ఇచ్చానని అయితే నా అనుమతి లేకుండా సినిమా చేసాడని ఆరోపిస్తున్నాడు జయకుమార్ .

శివ చిత్రంతో మీరేమో రాంగోపాల్ వర్మ దర్శకుడిగా బ్రేక్ ఇచ్చారు , కానీ అతడు మాత్రం ఇతరుల కెరీర్ ని బ్రేక్ చేస్తున్నాడు సార్ అంటూ నాగార్జున కు మొర పెట్టుకున్నాడు జయకుమార్ . ఇంతకుముందు కూడా మియా మాల్కోవా నటించిన జి ఎస్ టి కి స్క్రిప్ట్ అందించింది నేనే అని వర్మ పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే . అయితే జయకుమార్ ఎన్ని ఆరోపణలు చేస్తున్నప్పటికి వర్మ నుండి స్పందన లేదు అలాగే నాగార్జున నుండి కూడా .