నాగార్జున వర్మ ని అక్కడ తంతాడా

will nagarjuna kick ramgopal varmaనాగార్జున ని తన దర్శకత్వంలో నటించమని బ్రతిమిలాడాడు అయితే ఆ సమయంలో ఆఫీసర్ సినిమా కనుక విజయం సాధించకపోతే అక్కడ తన్నమని ఓ లెటర్ కూడా రాసాడట ! ఈ విషయాన్నీ నాగార్జున స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే . ”అక్కడ ” తన్నమంటే ……. సాధారణంగా జనాలు కామన్ భాషలో మాట్లాడుకునే తీరుగ చూస్తే” …….. ” మీద తన్నమని చెప్పాడన్న మాట .

ఆఫీసర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వర్మ నువ్వు అక్కడ తన్నమని అన్నావ్ కానీ సినిమా మీద నాకు చాలా నమ్మకం ఉంది కాబట్టి నిన్న అక్కడ తన్నాల్సిన అవసరం లేదు అని అన్నాడు కట్ చేస్తే ….. ఆఫీసర్ చిత్రం ఘోర పరాజయం పొందింది దాంతో ఇప్పుడు వర్మ ని నాగార్జున అక్కడ తంతాడా ? అన్న చర్చ జరుగుతోంది . నాగార్జున వర్మ ని తన్నమన్న చోట తన్నక పోయినా తన్నినంత పని చేసాడట . నాగార్జున కెరీర్ లోనే అత్యంత చెత్త సినిమాగా ఆఫీసర్ రికార్డులకెక్కింది అలాగే మేకింగ్ పరంగా కూడా అత్యంత దారుణమైన సినిమాగా మరో రికార్డ్ ని కూడా సొంతం చేసుకుంది . నాగార్జున కెరీర్ లో ఆఫీసర్ చిత్రం మాయని మచ్చలా తయారయ్యింది .