అవసరాల శ్రీనివాస్ కు నాని ఛాన్స్ ఇవ్వడా ?


Will nani give chance to Avasarala srinivas

నటుడు అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా కూడా సత్తా చాటిన విషయం తెలిసిందే . ఊహలు గుసగుసలాడే , జ్యో అచ్యుతానంద చిత్రాలతో వరుస విజయాలు సాధించి దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర ని వేసుకున్నాడు . అయితే అవసరాల శ్రీనివాస్ నాని తో సినిమా చేయాలనీ ఎప్పటినుండో అనుకుంటున్నాడు కానీ కుదరడం లేదు . ఈ ఇద్దరికీ ఒరేయ్ ….. అంటే ఒరేయ్ అని పిలుచుకునేంత చనువు ఉంది కానీ సినిమా మాత్రం కుదరడం లేదు .

రెండేళ్ల క్రితమే ఓ సినిమా చేయాలనీ అనుకున్నారు నాని – అవసరాల శ్రీనివాస్ కానీ సెట్ కాలేదు దాంతో ఇప్పుడు మళ్ళీ నాగశౌర్య తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు అవసరాల . నాగశౌర్య కూడా అవసరాల శ్రీనివాస్ తో సినిమా చేయాలనీ తహతహలాడుతున్నాడు ఎందుకంటే నాగశౌర్య ఎంతో నమ్మకంగా చేసిన నర్తనశాల అట్టర్ ప్లాప్ అయ్యింది . నాని ఇప్పట్లో ఛాన్స్ ఇచ్చేలా లేదు దాంతో నాగశౌర్య తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు అవసరాల .

English Title: Will nani give chance to Avasarala srinivas

SUBSCRIBE TO TOLLYWOOD VIDEO CHANNEL :https://goo.gl/DBvfV4