నాని విలన్ గా చేస్తే ఒప్పుకుంటారా ?


హీరో నాని విలన్ గా నటించడానికి సిద్ధం అవుతున్నాడు . తన గురువు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో విలన్ గా నటించడానికి సిద్దమయ్యాడు . అయితే ఈ సినిమాలో నాని క్యారెక్టర్ కు చాలా మంచి పేరు వస్తుందట , పెర్ఫార్మెన్స్ కు మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ కావడంతో నాని ఏమాత్రం సంకోచించకుండా ఒప్పుకున్నాడు పైగా తనని హీరోగా మార్చిన దర్శకుడు సినిమా కావడంతో నాని విలన్ గా చేస్తున్నాడు .

అయితే హీరోగా మంచి పేరు తెచ్చుకున్న నాని విలన్ గా నటిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా ? అన్న అనుమానం నెలకొంది . ప్రేక్షకులతో పాటుగా నాని అభిమానులు కూడా ఒప్పుకుంటారా ? అన్న అనుమానం కూడా నెలకొంది . మొత్తానికి నాని ఓ ప్రయోగానికి , సాహసానికి అయితే పూనుకున్నాడు ప్రేక్షకులను , అభిమానులను మెప్పిస్తాడా ? చూడాలి .