మెగా డాటర్ ఇప్పుడైనా కొడుతుందా హిట్టు


Will Niharika get success with suryakantham

మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా పరిచయమై చాలాకాలమే అవుతోంది కానీ ఇంతవరకు ఈ భామ హిట్ కొట్టిన దాఖలాలు అయితే లేవు . ఒకమనసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది , దాని తర్వాత తమిళ్ లో ఓ సినిమాలో నటించింది అది కూడా ప్లాప్ అలాగే హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా చేసింది అది కూడా ప్లాప్ అయ్యింది దాంతో నిహారిక హీరోయిన్ గా సక్సెస్ అవుతుందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది .

వెబ్ సిరీస్ లతో పాటుగా యాంకర్ గా కూడా రాణించింది నిహారిక కానీ వెండితెరపై మాత్రం వెలిగిపోవడం లేదు . ఇక తాజాగా సూర్యకాంతం అనే టైటిల్ తో ఓ సినిమా చేస్తోంది నిహారిక . సూర్యకాంతం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు . గయ్యాళి పాత్రల్లో సూర్యకాంతం ని మించిన వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు . అలాంటి పవర్ ఫుల్ టైటిల్ పెట్టుకొని చేస్తున్న నిహారిక మరి ఈ సినిమాతోనైనా హిట్ కొడుతుందా ? లేదంటే యధావిధిగా వచ్చానమ్మా …… పోయానమ్మా అంటూ వెళ్లిపోతుందా చూడాలి.

English Title: Will Niharika get success with suryakantham