ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ కొడతాడా ?


Will ntr gets double hattrick

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ చిత్రంతో కెరీర్ లో వరుసగా అయిదో హిట్ కొట్టాడు , మరో హిట్ కొడితే డబుల్ హ్యాట్రిక్ అవుతుంది . మరి డబుల్ హ్యాట్రిక్ కొడతాడా ? బాలయ్య బాబాయ్ లాగా డబుల్ బొనాంజ కొడతాడా ? అన్నది ఆసక్తికరంగా మారింది . 2015 లో వచ్చిన టెంపర్ కు ముందు వరసగా పరాజయాలతో ఇబ్బంది పడుతున్నాడు ఎన్టీఆర్ , అయితే టెంపర్ సినిమా ఎన్టీఆర్ కు సరికొత్త ఊపిరి అందించింది . ఆ సినిమా తర్వాత నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్ , జై లవకుశ చిత్రాలు వరుస విజయాలు సాధించాయి . ఇక ఇప్పుడేమో అరవింద సమేత చిత్రంతో అయిదవ విజయాన్ని అందుకున్నాడు .

టెంపర్ , నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్ , జై లవకుశ , అరవింద సమేత , మొత్తం అయిదు చిత్రాలు వరుస హిట్స్ సాధించాయి అంటే ఎన్టీఆర్ నుండి వచ్చే తదుపరి చిత్రం కూడా హిట్ అయితే డబుల్ హ్యాట్రిక్ అవుతుంది . 1986 లో నందమూరి బాలకృష్ణ కూడా వరుస విజయాలు సాధించి డబుల్ హ్యాట్రిక్ కొట్టి అప్పట్లో సంచలనం సృష్టించాడు . కాగ ఇన్నాళ్ళ తర్వాత ఆ చాన్స్ ఎన్టీఆర్ కు లభించింది . అలాగే ఎన్టీఆర్ మరో అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు కూడా . ఓవర్ సీస్ లో వరుసగా నాలుగు చిత్రాలు 1. 5 మిలియన్ డాలర్ల ని దాటిన అరుదైన రికార్డ్ కూడా ఎన్టీఆర్ సొంతం అయ్యింది . ఇక మిగిలింది డబుల్ హ్యాట్రిక్ అది ఎలాగూ అవుతుంది ఎందుకంటే ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న మల్టీస్టారర్ చిత్రం కాబట్టి కాకపోతే ఆ సినిమా 2020 లో కానీ విడుదల కాదు . అప్పటి వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడటమే !

English Title: Will ntr gets double hattrick