ఐరన్ లెగ్ మచ్చ పోతుందా ఈ భామకు


Will ntr give succes to pooja hegde

అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే కు ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఇప్పటి వరకు ఈ భామ నటించిన చిత్రాలన్నీ ప్లాప్ లు , డిజాస్టర్ లు అయ్యాయి మరి అయితే ఒక్క రంగస్థలం చిత్రం మాత్రం మినహాయింపు. రంగస్థలం చిత్రంలో పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ మాత్రమే చేసింది కాబట్టి ఆ సినిమా లెక్కలేదు ఇక మిగతా సినిమాల విషయానికి వస్తే …… ముకుంద , సాక్ష్యం , దువ్వాడ జగన్నాథం , చిత్రాలు ప్లాప్ అయ్యాయి అలాగే హిందీలో హృతిక్ రోషన్ సరసన నటించిన మొహంజదారో చిత్రం కూడా డిజాస్టర్ అయ్యింది దాంతో ఈ భామ కు ఐరన్ లెగ్ అనే ముద్రపడింది. ఐరన్ లెగ్ అనే ముద్ర పడినప్పటికి ఈ భామకు మాత్రం ఛాన్స్ లు వస్తూనే ఉన్నాయి.

తాజాగా ఎన్టీఆర్ సరసన అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నటించింది . ఇక ఈ సినిమా అక్టోబర్ 11న భారీ ఎత్తున విడుదల కానుంది. అయితే పూజా హెగ్డే కు ఇప్పటి వరకు హిట్ లేదు పైగా ఐరన్ లెగ్ ముద్ర ఉంది దాంతో ఎన్టీఆర్ కు కూడా ఐరన్ లెగ్ ముద్ర అంటుకుంటుందా ? లేక హిట్ ఇచ్చి పూజా హెగ్డే ని గోల్డెన్ లెగ్ గా మారుస్తాడా చూడాలి. ఎన్టీఆర్ తో నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం విడుదలకు సిద్దంగా ఉండగా మహేష్ బాబు సరసన మహర్షి చిత్రంలో నటిస్తోంది. అలాగే ప్రభాస్ సరసన కూడా నటించడానికి రెడీ అవుతోంది పూజా హెగ్డే .

English Title: Will ntr give succes to pooja hegde