బాలయ్య పొలిటికల్ కామెంట్లపై ఎన్టీఆర్ స్పందిస్తాడా?

బాలయ్య పొలిటికల్ కామెంట్లపై ఎన్టీఆర్ స్పందిస్తాడా?
బాలయ్య పొలిటికల్ కామెంట్లపై ఎన్టీఆర్ స్పందిస్తాడా?

నిన్న నందమూరి బాలకృష్ణ ఒక టివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తుపై, తెలుగు దేశం పార్టీలో అతని స్థానంపై ప్రశ్న ఎదురవ్వగా బాలకృష్ణ చాలా జాగ్రత్తగా స్పందించాడు.

ఎవరికి వారికి ప్రాధాన్యతలు ఉంటాయి. ఇక్కడ ఎవరినీ ఫోర్స్ చేయలేము. వారి వారి ఇష్టాల బట్టి అంతా ఉంటుంది అని సమాధానమిచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీలో తిరిగి యాక్టివ్ అయితే అది పార్టీకి ప్లస్ అవుతుందా అని అడగ్గా దానికి బాలయ్య లాంగ్ పాజ్ ను ఇచ్చాడు.

ఆ తర్వాత నవ్వుతూ అది ప్లస్ అవ్వొచ్చు, మైనస్ అవ్వొచ్చు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటూ తనదైన శైలిలో స్పందించాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నందమూరి అభిమానుల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఎన్టీఆర్ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తాడా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి అయితే ఎన్టీఆర్ స్పందించలేదు మరి.