గత ఎన్నికల్లో ఎన్టీఆర్ తో పాటుగా హరికృష్ణ , కళ్యాణ్ రామ్ లు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు . అయితే ఇటీవలే హరికృష్ణ మరణించడంతో మళ్ళీ నందమూరి కుటుంబం ఒక్కటయ్యింది . అలాగే నారా చంద్రబాబు నాయుడితో కూడా కలిసిపోయింది . గ్రేటర్ లో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరధం పట్టారు ఓటర్లు అయితే తెలంగాణలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల తెలుగుదేశం పార్టీకి చెందిన 12 మంది తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు . దాంతో తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండాపోయింది . అందుకే ఈ ఎన్నికల్లో కళ్యాణ్ రామ్ ని గ్రేటర్ లోని ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేయించాలని భావిస్తున్నారట ! మరి నందమూరి సోదరులు కళ్యాణ్ రామ్ , ఎన్టీఆర్ లు అందుకు ఒప్పుకుంటారా చూడాలి .
English Title: Will NTR support to kalyan ram