అక్క గెలుపు కోసం ఎన్టీఆర్ ప్రచారం చేస్తాడా ?


Will ntr support to sister suhasini

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అక్క సుహాసిని కోసం కూకట్ పల్లి లో తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేస్తాడా ? ఇప్పుడు అందరూ వేస్తున్న ప్రశ్న ఇది . తెలంగాణలో ఎన్నికలు సమీపించిన తరుణంలో తెలుగుదేశం పార్టీ తరుపున కూకట్ పల్లి స్థానం నుండి నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని కి టికెట్ కేటాయించారు . తీవ్ర తర్జన భర్జనలు అనంతరం సుహాసిని తెలంగాణ ఎన్నికల బరిలో దిగడానికి సిద్దమయ్యింది . కూకట్ పల్లి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది దాంతో అక్కడి నుండి సుహాసిని ని పోటీకి నిలబెట్టారు . సీమాంధ్రుల ఓట్లు ఎక్కువగా ఉండటంతో దాదాపుగా విజయం సాధించడం ఖాయమని ధీమాగా ఉన్నారు . అయితే ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ అక్క సుహాసిని కోసం ప్రచారం చేస్తాడా ? ఇప్పుడు అందరూ వేస్తున్న ప్రశ్న ఇదే .

జూనియర్ ఎన్టీఆర్ గతకొంత కాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నాడు , అయితే హరికృష్ణ మరణం తర్వాత నందమూరి – నారా కుటుంబాలు మళ్ళీ ఒక్కటయ్యాయి . కానీ తెలుగుదేశం పార్టీ తరుపున ఎన్టీఆర్ ప్రచారం చేయడానికి మాత్రం ముందుకు రాలేదు , కట్ చేస్తే ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న ఈ సమయంలో ఎన్టీఆర్ అక్క సుహాసిని కి టికెట్ ఇవ్వడం వల్ల తప్పకుండా ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ప్రచారంలో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది . మరి ఈ పరిస్థితి నుండి ఎన్టీఆర్ ఎలా బయట పడతాడో ? ఎలా ఎదుర్కొంటాడో చూడాలి .

English Title: Will ntr support to sister suhasini ?