ఎన్టీఆర్ అందుకు ఒప్పుకుంటాడా


will NTR support to telangana TDPయంగ్ టైగర్ ఎన్టీఆర్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే . దాంతో అతడితో తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయించాలని భావిస్తున్నారు తెలంగాణ తెలుగుదేశం నాయకులు . అయితే ఎన్టీఆర్ 2009 లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరుపున పెద్ద ఎత్తున ప్రచారం చేసాడు . ఎన్టీఆర్ ప్రచార సభలకు జనాలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు కానీ ఓట్లు మాత్రం పడలేదు పైగా ఆ ప్రచారంలో భాగంగా పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు ఎన్టీఆర్ .

కట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చాయి , తెలుగుదేశం పార్టీ కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ని ఓడించాలని కంకణం కట్టుకున్నారు అందుకే బద్ధశత్రువైన కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం మెట్టు దిగారు . ఇదే సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ తో ప్రచారం చేయిస్తే కొంతవరకు మంచి ఫలితాలు సాధించవచ్చు అని భావిస్తున్నారట తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు . ఇదే విషయాన్నీ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెవిలో వేయడంతో బాబు ఆ దిశగా ఆలోచన చేస్తున్నాడట . అయితే ఎన్టీఆర్ మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాలి ఎన్నికల ప్రచారం మీద . ఒకవేళ ప్రచారానికి ఒప్పుకుంటాడా ? ఒప్పుకుంటే తెలుగుదేశం పార్టీ కి పండగే ! కొన్ని సీట్లైనా వస్తాయి కదా !

English Title: will ntr support to telangana TDP