పవన్ కళ్యాణ్ కు అంత దమ్ము లేదా ?


Will Pawan Kalyan contest in Telangana Electionsప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చాను అంటూ జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ పైనే దృష్టి పెడుతున్నాడు చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేస్తున్నాడు కానీ తెలంగాణ ముఖ్యమంత్రిపై కానీ టిఆర్ఎస్ పార్టీ పై కానీ విమర్శలు మాత్రం చేయడం లేదు అంతేకాదు ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు వచ్చిపడ్డాయి అయితే ఎన్నికల్లో మాత్రం పోటీ చేయడానికి సుముఖంగా లేడు పవన్ కళ్యాణ్ . కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడటానికి , పోటీ చేయడానికి పవన్ జనసేన ని సమాయత్తం చేయలేకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు .

పవన్ కళ్యాణ్ కు అంత దమ్ము లేదని , అందుకే కేసీఆర్ ని విమర్శించలేక పోతున్నాడని ……. తెలంగాణలో పోటీ చేయడానికి జంకుతున్నాడని అంటున్నారు . ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ అక్కడ జనసేన తరుపున అభ్యర్థులను రంగంలో దించడానికి సన్నాహాలు చేస్తున్నాడు . చంద్రబాబు ప్రభుత్వం పై చీటికీ మాటికి విమర్శిస్తున్న పవన్ కేసీఆర్ పై మాత్రం పల్లెత్తు మాట అనకపోవడం పవన్ డొల్లతనాన్ని నిదర్శనమని విమర్శిస్తున్నారు . తెలంగాణలో పోటీ చేసేంత దమ్ము లేదని అందుకే పోటీ పట్ల విముఖత చూపిస్తున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు .