రేణు దేశాయ్ పాల్గొంటే పవన్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా ?


Will Pawan kalyan fans agree with renu desai
Will Pawan kalyan fans agree with renu desai

తెలుగు బిగ్ బాస్ 3 లో రేణు దేశాయ్ పార్టిసిపేట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి , అయితే రేణు దేశాయ్ బిగ్ బాస్ 3 లాంటి షోలో పాల్గొంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా ? ఒప్పుకుంటారా ? అన్న అనుమానం నెలకొంది . అసలు ఇప్పటికే రేణు దేశాయ్ రెండో పెళ్లి పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రేణు ని ఇబ్బంది పెడుతున్నారు . రకరకాల కామెంట్స్ చేస్తున్నారు అలాంటిది బిగ్ బాస్ 3 లో పాల్గొంటే ఊరుకుంటారా ?

అదేపనిగా ట్రోల్ చేయడం ఖాయం . అయితే బిగ్ బాస్ 3 లో రేణు దేశాయ్ పాల్గొంటోందా ? లేదా ? అన్నది ఇప్పుడే తెలియదు ఎందుకంటే అధికారికంగా ప్రేక్షకులకు పరిచయం చేసే వరకు కన్ఫర్మ్ కాదు . కానీ ప్రస్తుతం వినబడుతున్న కథనం ప్రకారం మాత్రం రేణు దేశాయ్ పేరు లిస్ట్ లో ఉంది . అయితే ఆమె ఒప్పుకుంటుందా ? ఒకవేళ రేణు ఒప్పుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా ?ఇది పెద్ద పెద్ద ప్రశ్నే !