అక్షయ్ కుమార్ బాటలో పవన్ కళ్యాణ్


అక్షయ్ కుమార్ బాటలో పవన్ కళ్యాణ్
అక్షయ్ కుమార్ బాటలో పవన్ కళ్యాణ్

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ బాటలోనే పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారా.? అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొంచెం రాజకీయాలకు విరామం తీసుకుని సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్ హిట్ మూవీ అయిన “బదలా” ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాను ఇప్పటికే తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ “నేర్కొండ పార్వై” అనే పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టారు. తర్వాత కూడా రెండు మూడు సినిమాల కథలతో పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తున్నారు స్టార్ డైరెక్టర్లు. తాజాగా రాజకీయంగా కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేయాలని కీలక నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్, సినిమాలలో కూడా ఇక మీదట సామాజిక అంశాలతో కూడినటువంటి విషయాలు మాత్రమే ఉండేలా చూసుకుంటున్నారు.

దీనికి మంచి ఉదాహరణ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. ఆయన కూడా సినిమాలు చేసుకుంటూనే క్రియాశీలకంగా భారతీయ జనతా పార్టీ ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్ గత సినిమాలు చూసినట్లయితే ఎయిర్ లిఫ్ట్, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, పాడ్ మాన్, కేసరి, మిషన్ మంగళ్ ఇలాంటి సినిమాలు సామాజిక అంశాలు చూపిస్తూనే అంతర్లీనంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను సపోర్ట్ చేస్తున్నట్లు గా ఉంటాయి. కేంద్రంలో వరుసగా రెండోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక బాలీవుడ్ లో ఖాన్ ల ప్రాభవం తగ్గింది. అంతకు ముందు ఎవరూ పట్టించుకోని భారతదేశ చరిత్ర మీద వరుసగా సినిమాలు రావడం మొదలుపెట్టాయి అందులోనూ హిందూమతాన్ని అంతర్లీనంగా గొప్పగా చూపించే సినిమాలు ఈ మధ్య వస్తున్నాయి వాటికి ఉదాహరణ పానిపట్, సుబేదారి తానాజీ లాంటి సినిమాలు. కాబట్టి ఇకమీదట పవన్ కూడా తాను చేయబోయే సినిమాల లో భారతీయ జనతా పార్టీ తాలుకు సిద్ధాంతాలను అంతర్లీనంగా చూపించే అవకాశం ఉంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ తాను చేసిన సినిమాల్లో అంతర్లీనంగా ఒక బలమైన సిద్ధాంతాన్ని సందేశాన్ని మాత్రమే ఉండేలా చూసుకునేవారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఆయన తన ఆలోచనలు ఎప్పుడూ తన సినిమాల్లో చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి చూద్దాం టాలీవుడ్ చేగువేరా భవిష్యత్తులో ఎలా తన రాజకీయ సినీ జీవితాన్ని కొనసాగిస్తాడో.?