అక్టోబర్ 23 న పెళ్ళి వార్త చెప్పబోతున్నాడా ప్రభాస్


Will Prabhas announce marriage news on oct 23 rd

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 దాంతో ఆ రోజున ముఖ్యమైన వార్త మీతో పంచుకోబోతున్నాను అంటూ పోస్ట్ చేసాడు ప్రభాస్ దాంతో ఆ వార్త పెళ్ళి గురించే కావచ్చు అన్న హడావుడి మొదలయ్యింది . తాజాగా ఈ పుట్టినరోజుతో ప్రభాస్ 40 వ వడిలో అడుగుపెత్తబోతున్నాడు దాంతో తప్పకుండా పెళ్ళి వార్తే అయ్యుంటుందని అంటున్నారు . ఈరోజు అక్టోబర్ 18 కాగా మరో నాలుగు రోజులు పూర్తి అయితే ఆ విషయం ఏంటి అన్నది తేలిపోతుంది . అయితే అప్పటివరకు ఉత్సుకతని తట్టుకోలేని వాళ్ళు పెళ్ళి వార్తేనా ? లేక మరొకటా ? సినిమా విషయమా ? అంటూ చర్చ మొదలు పెట్టారు .

ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే చిత్రం కూడా చేస్తున్నాడు . ఆ సినిమాల తాలూకు విషయాలు ఎవైన ఉండొచ్చు అని తెలుస్తున్నప్పటికీ అది పెద్ద విషయం కాదు తప్పకుండా పెళ్ళి విషయమే అని తెలుస్తోంది . అనుష్క తో ప్రభాస్ పెళ్ళి కానున్నట్లు గతకొంత కాలంగా అదేపనిగా వార్తలు వస్తున్నాయి . ఆ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చేలా అనుష్క ఇటలీ వెళ్లి మరీ ప్రభాస్ ని కలిసింది దాంతో పెళ్ళి పుకార్లు షికారు చేస్తున్నాయి . ఇక ప్రభాస్ పెద్దనాన్న కూడా త్వరగా ప్రభాస్ పెళ్ళి చేయాలనీ చూస్తున్నాడు . మరి ఈ పుట్టినరోజున ఆ శుభవార్త చెబుతాడా ? లేక తూచ్ అంటాడా చూడాలి .

English Title: Will Prabhas announce marriage news on oct 23 rd