ప్రభాస్ ఆ నిర్మాతని ఆదుకుంటాడా ?


ఒకప్పుడు ఎం ఎస్ రాజు అంటే అగ్ర నిర్మాత , ఆయన నిర్మించిన చిత్రాలు వరుసగా సిల్వర్ జూబ్లీ లు అయ్యాయి దాంతో ఎం ఎస్ రాజు పట్టిందల్లా బంగారమే అనుకున్నారు కానీ కాలం మారింది . ఎప్పుడైతే అదృష్టం తిరగబడుతుందో అప్పుడు అగ్ర నిర్మాత కూడా అనామకుడిలా మారిపోతాడు ఇప్పుడు అదే పరిస్థితి ఎం ఎస్ రాజు పరిస్థితి . 
 
ఒకప్పుడు అగ్ర నిర్మాత కానీ సీన్ రివర్స్ అయ్యింది చిత్రాలన్నీ ఘోర పరాజయం పొందడంతో ఎం ఎస్ రాజు ఆర్ధికంగా కూడా చితికిపోయాడు . అయితే అలాంటి నిర్మాతని ఇప్పుడు ఆదుకోవాలంటే ఒక్క ప్రభాస్ మాత్రమే ! ఎందుకంటే ప్రభాస్ ని స్టార్ ని చేసింది ఈ ఎం ఎస్ రాజు నే ! ఎం ఎస్ రాజు నిర్మించిన వర్షం చిత్రంతో ప్రభాస్ స్టార్ అయ్యాడు , దాని తర్వాత పౌర్ణమి అనే సినిమా చేసారు ఈ ఇద్దరూ కలిసి ఆ సినిమా దారుణంగా దెబ్బ కొట్టింది . దాంతో మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడట అప్పట్లో ప్రభాస్ . 
 
ఇప్పుడు ప్రభాస్ కు దేశ వ్యాప్తంగా మార్కెట్ ఉంది దాంతో ప్రభాస్ ఎం ఎస్ రాజు కు డేట్స్ ఇస్తే ఆర్ధిక ఇబ్బందుల నుండి బయట పడతాడేమో ! కొడుకు సుమంత్ హీరోగా నటిస్తున్నాడు కానీ పాపం సక్సెస్ కాలేకపోతున్నాడు . మరి ప్రభాస్ ఆదుకుంటాడా ఎం ఎస్ రాజు ని .