శివాని వల్ల రాజశేఖర్ ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయా


will rajasekhar gets profits with shivani

హీరో డాక్టర్ రాజశేఖర్ కూతురు శివాని హీరోయిన్ గా అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే , ఇంకా హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోకుండానే తెలుగులో అలాగే తమిళ్ లో రెండు చిత్రాల్లో నటిస్తోంది కాగా తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించనున్న చిత్రంలో శివాని రాజశేఖర్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . కెరీర్ ప్రారంభంలోనే వరుసగా మూడు చిత్రాలు రావడం సంచలనమే ! ఒకవేళ హిట్స్ పడితే శివాని రాజశేఖర్ హీరోయిన్ గా సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది .

హీరోగా డాక్టర్ రాజశేఖర్ ఓ వెలుగు వెలిగాడు 90 వ దశకంలో . తెలుగునాట అగ్ర హీరోగా వెలుగొందిన రాజశేఖర్ 2006 తర్వాత తన ప్రాభవం కోల్పోయాడు . అయితే ఈ ఏడాది లో మళ్ళీ గరుడవేగ చిత్రంతో మళ్ళీ హిట్ కొట్టాడు రాజశేఖర్ . ఒక హీరో కూతురు హీరోయిన్ కావడం అన్నది విశేషమే మరి . వరుసగా మూడు భాషల్లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేయడం శివాని అదృష్టం .

మలయాళ సూపర్ స్టార్ కొడుకు సరసన నటించే ఛాన్స్ రావడం అంటే శివాని కి అదృష్టం బాగానే ఉన్నట్లు . ఈ మూడు సినిమాలు హిట్ అయితే స్టార్ హీరోయిన్ అయిపోయినట్లే అప్పుడు రాజశేఖర్ కు ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి . హీరోగా సంచలనం సృష్టించిన రాజశేఖర్ సొంత సినిమాలు తీసి ఆర్ధికంగా చితికిపోయాడు .హైదరాబాద్ లో ఉన్న సొంత ఇంటిని అమ్మేయడమే కాకుండా మద్రాస్ లో ఉన్న ఆఫీసు ని సైతం అమ్మేశాడు . ఇప్పుడు శివాని స్టార్ గా ఎదిగితే రాజశేఖర్ ఆర్ధిక ఇబ్బందుల్లోంచి బయటపడతాడు .

English Title: will rajasekhar gets profits with shivani