ఈ రాక్షసుడు ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా ?


Rakshasudu
Rakshasudu

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు చిత్రం ఈరోజు భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే . కాగా 1986 లో మెగాస్టార్ చిరంజీవి నటించిన రాక్షసుడు చిత్రం విడుదలై ప్రభంజనం సృష్టించింది . చిరంజీవి ని నెంబర్ వన్ హీరోగా మరింత సుస్థిరమైన స్థానాన్ని అందించింది . అప్పట్లో రాక్షసుడు పెద్ద సంచలనమే సృష్టించింది . కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత అదే పేరుతో వస్తున్న రాక్షసుడు అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందా ? అన్నది ప్రశ్నగా మారింది .

ఆసక్తికరంగా కూడా మారింది . ఈ రాక్షసుడు చిత్రానికి ఆ రాక్షసుడు చిత్రానికి పోలికలు కేవలం టైటిల్ లో మాత్రమే ! బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నిలదొక్కు కోవడానికి స్టార్ డం అందుకోవడానికి తహతహలాడుతున్నాడు అయిదేళ్లుగా . పైగా ఈ చిత్రం తమిళంలో పెద్ద హిట్ దాంతో ఖచ్చితంగా హిట్ అవుతుందన్న ధీమా లో ఉన్నారు ఆ చిత్ర బృందం .