రష్మిక మళ్ళీ తన పాత బాయ్ ఫ్రెండ్ తో జతకడుతుందా?


రష్మిక మళ్ళీ తన పాత బాయ్ ఫ్రెండ్ తో జతకడుతుందా?
రష్మిక మళ్ళీ తన పాత బాయ్ ఫ్రెండ్ తో జతకడుతుందా?

రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ లో మారుమోగుతున్న పేరు. ప్రస్తుతం ఈమె హవా మాములుగా లేదు. రెండు నెలల్లో రెండు భారీ హిట్స్ అందుకుని రష్మిక టాప్ ప్లేస్ లో దూసుకుపోతోంది. జనవరిలో మహేష్ సరసన చేసిన సరిలేరు నీకెవ్వరు, ఫిబ్రవరిలో నితిన్ తో చేసిన భీష్మ రెండూ కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక రష్మిక అల్లు అర్జున్ – సుకుమార్ సినిమాలో నటించనుంది. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోయే చిత్రంలో కూడా ఈమెనే హీరోయిన్ గా తీసుకోవాలి అనుకుంటున్నారు. ఇలా వరసగా బడా ప్రాజెక్టులతో ఈ హీరోయిన్ టాలీవుడ్ లో దూసుకుపోతోంది.

అయితే అమ్మడి మూలాలు మాత్రం శాండల్ వుడ్ లో ఉన్న విషయం తెల్సిందే. రష్మిక నటించిన తొలి చిత్రం కన్నడలో తెరకెక్కినదే. 2016లో కన్నడలో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన కిరిక్ పార్టీ సినిమాతో అమ్మడి సినీ డెబ్యూ జరిగింది. ఆ సినిమాలో అక్కడి స్టార్ హీరో రక్షిత్ శెట్టి సరసన నటించింది. ఈ సినిమానే తెలుగులో కిరాక్ పార్టీ పేరుతొ నిఖిల్ రీమేక్ చేసాడు. కానీ హిట్ సాధించలేకపోయాడు. అది వేరే విషయం.

ఇక కిరిక్ పార్టీ సమయంలో రక్షిత్ శెట్టి, రష్మిక మధ్య మొదలైన ప్రేమాయణం చాలా దూరం వెళ్ళింది. ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగాక వివిధ కారణాల వల్ల ఎవరి దారులు వాళ్ళు చూసుకున్నారు. విడిపోయినా కూడా ఇద్దరూ హుందాగా ఒకరి గురించి ఒకరు మంచిగానే చెప్పారు. అయితే అప్పట్లో రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ మాత్రం రష్మికను ట్రోల్ చేసారు. ఇప్పుడు అంతా సద్దుమణిగాక మళ్ళీ ఇద్దరి గురించి వార్తలు వస్తున్నాయి.

దానికి కారణం కూడా కిరిక్ పార్టీనే కావడం విశేషం. సోషల్ మీడియాలో రక్షిత్ శెట్టి, కిరిక్ పార్టీ సీక్వెల్ కు అనువైన కథ దొరికిందని, త్వరలోనే ఈ సినిమా ఉంటుందని రివీల్ చేసాడు. ఈ న్యూస్ విన్న వెంటనే ఎవరికైనా కలిగే మొదటి అనుమానం మరి రష్మిక ఈ చిత్రంలో ఉంటుందా అని? మరి దానికి రక్షిత్ శెట్టినే సమాధానం ఇవ్వగలడు.