రష్మిక మందన్న ఆ ఇద్దరి కోరిక తీరుస్తుందా ?


అక్కినేని అఖిల్ కు హిట్ లేదు అలాగే వరుసగా ప్లాప్ చిత్రాలతో రేసులో లేకుండాపోయిన బొమ్మరిల్లు భాస్కర్ ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు . ఈ ఇద్దరికీ ఓ కోరిక ఉంది మరి ఆ కోరిక ని అందాల భామ రష్మిక మందన్న తీరుస్తుందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది . ఇంతకీ ఈ ఇద్దరికీ ఉన్న కోరిక ఏంటో తెలుసా ……. సక్సెస్ . అవును ఇద్దరికీ సక్సెస్ లేదు కాబట్టి రష్మిక మందన్న సక్సెస్ ని ఈ ఇద్దరికీ పంచుతుందా ?

అఖిల్ , హలో , మిస్టర్ మజ్ను ఇలా మూడు చిత్రాలతో వరుస ప్లాప్ లతో కెరీర్ లో ఇబ్బంది పడుతున్నాడు అక్కినేని అఖిల్ . ఇక బొమ్మరిల్లు భాస్కర్ కూడా ప్లాప్ లతో సినిమాలు లేకుండాపోయాయి . అయితే తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ కు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఛాన్స్ వచ్చింది . అఖిల్ హీరో కాగా హీరోయిన్ రష్మిక మందన్న . ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది . దాంతో సక్సెస్ లేని హీరోకు దర్శకుడికి రష్మిక మందన్న సక్సెస్ అందిస్తుందా ? చూడాలి .