ఆర్ ఎక్స్ 100 లా హిట్ కొడతాడా ?


ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయం సాధించిన హీరో కార్తికేయ . అసలు హీరో అవుతానని కలలో కూడా అనుకోలేదు అలాంటిది నిజం అయ్యింది అదే గొప్ప విషయం అనుకుంటే కలైపులి ఎస్ థాను అనే అగ్ర నిర్మాత నాతో సినిమా చేయడం నాకు గర్వంగా ఉందని అంటున్నాడు హీరో కార్తికేయ . తాజాగా ఈ హీరో ” హిప్పీ ” అనే చిత్రంలో నటించాడు . టి ఎన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కలైపులి ఎస్ థాను లాంటి స్టార్ ప్రొడ్యూసర్ నిర్మించడం విశేషం .

కాగా హిప్పీ సినిమా ఈరోజు విడుదల అవుతోంది . ప్లే బాయ్ గా కార్తికేయ నటించిన ఈ చిత్రం పై యువతలో మంచి క్రేజ్ ఉంది . ఆర్ ఎక్స్ 100 హీరో కావడం అలాగే టీజర్ , ట్రైలర్ లతో యూత్ ఫుల్ మూవీగా తేలడంతో యువత ఈ సినిమా కోసం ఎదురు చూసేలా చేస్తోంది . ఇక ఈరోజే విడుదల అవుతుండటంతో ఈ సినిమా విజయం పట్ల ధీమాగా ఉన్నాడు కార్తికేయ . అయితే ఆర్ ఎక్స్ 100 లా సక్సెస్ కొడతాడా ? లేదా అన్నది కొద్దీ గంటల్లోనే తేలిపోనుంది .