మెగా మేనల్లుడు హిట్ కొడతాడా


will saidharam tej gets hit with tej i love you

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు హిట్స్ లేక చాలాకాలం అవుతోంది . 2016 లో వచ్చిన సుప్రీమ్ చిత్రం మాత్రమే సాయి ధరమ్ తేజ్ కు సూపర్ హిట్ నిచ్చింది దాని తర్వాత చేసిన చిత్రాలన్నీ ఘోర పరాజయం పొందాయి . రెండేళ్లలో అయిదు చిత్రాలు చేయగా అవన్నీ డిజాస్టర్ లు అయ్యాయి . దాంతో ఎలాంటి సినిమా చేయాలో తెలీక సతమతం అయ్యాడు అయితే మొత్తానికి పవన్ కళ్యాణ్ కు తొలిప్రేమ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కరుణాకరన్ తో సినిమా చేసాడు మెగా మేనల్లుడు .

ప్రముఖ నిర్మాత కే ఎస్ రామారావు నిర్మించిన చిత్రం కావడం కరుణాకరన్ దర్శకుడు కావడంతో మెగా మేనల్లుడి ఆశలన్నీ ఆ సినిమాపైనే ఉన్నాయి . జూలై 6న ” తేజ్ ఐ లవ్ యు ” చిత్రం విడుదల కానుంది అయితే దానికి పోటీగా ఒకరోజు ముందుగానే గోపీచంద్ నటించిన ” పంతం ” విడుదల అవుతోంది . ఆపై వారంలో చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన విజేత విడుదల అవుతోంది దాంతో సాయి ధరమ్ తేజ్ సినిమా బాగుంటేనే నిలబడుతుంది లేకపోతే వెంటనే థియేటర్ లనుండి పీకేయడం ఖాయం . తేజ్ ఐ లవ్ యు ట్రైలర్ ఏమంత గొప్పగా లేదు మరి హిట్ అవుతుందా ? లేదా ? తెలియాలంటే జూలై 6 న తేలిపోనుంది .

English Title: will sai dharam tej gets hit with tej i love you