“రాజన్న” లాగ ఉంటుందా సైరా నరసింహా రెడ్డి ?


Will Saira Narasimha Reddy movie be like "Rajanna"?
Will Saira Narasimha Reddy movie be like “Rajanna”?

దర్శకధీరుడు “రాజమౌళి” కి ఇంతవరకు పరాజయం ఎదురవ్వలేదు కారణం అతని తండ్రి “కె.వి. విజయేంద్ర ప్రసాద్” గారు. రాజమౌళి తీసిన ప్రతి సినిమాకి తండ్రి కథ అందియ్యడం, సినిమా ఫలితం ఆకాశాన్ని తాకడం మనకి తెలుసు.

అలాగే కె.వి. విజయేంద్ర ప్రసాద్ గారు అడపాదడపా సినిమాలకి దర్శకత్వం చేసినారు, కానీ అవేమి విజయం పొందలేదు. అందులో ముఖ్యంగా “రాజన్న” ఒక్కటి. నాగార్జున గారితో 2011లో తీసిన సినిమా అది.

ఆ సినిమా కి, సైరా కి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? నిజానికి రాజన్నకి, సైరాకి పోలికలు లేవు. కానీ చరిత్ర చూస్కుంటే సైరా నే ముందు. కానీ దర్శకుడు “సురేందర్ రెడ్డి” సైరా కి, రాజన్న సన్నివేశాలు ఉపయోగం అని వాడుకున్నది నిన్న ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. రాజన్న లో నాగార్జునకి సహాయం గా సినిమాలో నలుగురు ఉంటారు. వాళ్ళు, నాగార్జున గారు కలిసి “తెల్ల వాళ్ళ” కి ఎదురువెళ్ళటం, వాళ్ళ చేతిలో దుర్మరణం అవ్వడం చూసాం ఆ సినిమాలో.

అదే ఇప్పుడు సైరా విషయంలో కూడా జరగనున్నదా అని అందరూ వాపోతున్నారు. సన్నివేశం వేరు అయిన, చరిత్ర వేరు అయిన కానీ “చిరంజీవి” గారి పక్కన్న కూడా నలుగురు ఉన్నారు అని ప్రేక్షకులు అందరూ అదేపని గా మాట్లాడుకుంటున్నారు.