ఈ హీరోకు ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా ?


Bellamkonda Sai Srinivas
Bellamkonda Sai Srinivas

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న రాక్షసుడు చిత్రం ఆగస్టు 2 న విడుదలకు సిద్ధమైంది . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయమై అప్పుడే ఐదేళ్లు పూర్తయ్యింది . ఈ అయిదేళ్లలో రాక్షసుడు చిత్రంతో కలిపి 7 చిత్రాల్లో నటించాడు అందులో 6 చిత్రాలు విడుదల కాగా 7 వ చిత్రంగా రాక్షసుడు ఆగస్టు 2 న విడుదల కానుంది . తెలుగులో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ లకు 7 వ చిత్రంగా విడుదలైన చిత్రాలు ప్రభంజనం సృష్టించాయి .

అంతేకాదు అక్కినేని నాగచైతన్య కు కూడా 7 వ చిత్రం మనం బ్లాక్ బస్టర్ కావడమే కాకుండా మరిచిపోలేని చిత్రంగా నిలిచింది . దాంతో అదే సెంటిమెంట్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు వర్కౌట్ అవుతుందా ? అన్న ఆసక్తి నెలకొంది . రాక్షసుడు చిత్రం తమిళనాట సంచలన విజయం సాధించిన చిత్రం . దాన్ని తెలుగులో రీమేక్ చేసారు . ఇక ఇది కూడా హిట్ అయి బెల్లంకొండ కు కమర్షియల్ హిట్ నిస్తే తప్పకుండా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయినట్లే ! ఇది సెంటిమెంట్ పరిశ్రమ కాబట్టి ఈ రకంగా ఆలోచన చేస్తున్నారు మరి . అయితే అసలు ఫలితం ఆగస్టు 2 న తేలనుంది .