ఫస్ట్ టైమ్ ఓకే.. ఈసారి షాహిద్ ఏం చేయబోతున్నాడు?


ఫస్ట్ టైమ్ ఓకే.. ఈసారి షాహిద్ ఏం చేయబోతున్నాడు?
ఫస్ట్ టైమ్ ఓకే.. ఈసారి షాహిద్ ఏం చేయబోతున్నాడు?

షాహిద్ కపూర్ ఎప్పటినుండో బాలీవుడ్ లో హీరోగా కొనసాగుతున్నా ఓ మాదిరి హిట్లు ఇచ్చాడు కానీ అదిరిపోయే రేంజ్ లో సినిమా రిజల్ట్ ను ఇవ్వలేదు. అసలు కబీర్ సింగ్ ముందు దాకా షాహిద్ కు 100 కోట్ల క్లబ్ లో స్థానమే లేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అయితే కబీర్ సింగ్ సినిమాతో తన ఫేట్ మారిపోయింది. 100 కోట్లు కాదు 200 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించాడు షాహిద్. బాక్స్ ఆఫీస్ నెంబర్ల సంగతి పక్కనపెడితే షాహిద్ ఎంత గొప్ప నటుడన్నది బాలీవుడ్ ఈ చిత్రంతో గుర్తించింది. నిజానికి మొదట అర్జున్ రెడ్డి సినిమాను షాహిద్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు అనగానే తెలుగు ప్రేక్షకులు ముందు సందేహించారు. విజయ్ దేవరకొండ నటనను షాహిద్ కపూర్ మ్యాచ్ చేయగలడా అని సందేహించారు చాలా మంది. కానీ కబీర్ సింగ్ విడుదలయ్యాక అందరి అనుమానాలను పటాపంచలు చేసేసాడు షాహిద్. విజయ్ కు ధీటుగా అటు ఎమోషనల్ సీన్స్ లోనూ, ఇటు అగ్రెసివ్ గా చేయాల్సిన సన్నివేశాల్లోనూ షాహిద్ చెలరేగిపోయాడు. ఫలితంగా షాహిద్ కపూర్ కు బాలీవుడ్ లో ఈ చిత్రం ద్వారా గౌరవం పెరిగింది. షాహిద్ కు టాలీవుడ్ సినిమాలపై గురి కుదిరింది.

తన తర్వాతి సినిమాను కూడా టాలీవుడ్ నుండే తీసుకున్నాడు షాహిద్. కబీర్ సింగ్ తర్వాత తాను చేయబోయే చిత్రం తెలుగులో ఇటీవలే విడుదలై సూపర్ హిట్టైన జెర్సీను రీమేక్ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రేపరేషన్స్ ఇప్పటికే షాహిద్ మొదలుపెట్టేశాడు. రీసెంట్ గా జెర్సీ కోసం సన్నద్ధమవుతున్నా అంటూ తన ఫోటో ఒకటి పోస్ట్ చేసాడు. జెర్సీ ఎమోషనల్ ఎంటర్టైనర్. క్రికెట్ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ఒక క్రికెటర్ కథ జెర్సీ. నాని ఈ చిత్రంలో నటనతో అందరినీ కట్టిపడేసాడు. నటించడానికి ఏ మాత్రం స్కోప్ ఉన్న సినిమాలనైనా తన నటనతో మరో మెట్టు ఎక్కించగల నాని, జెర్సీలో తన విశ్వరూపాన్ని చూపించేసాడు. నాని ఎంత మంచి నటుడన్నది చెప్పడానికి ఆ ట్రైన్ సీన్ ఒక్కటి చాలు. అలాగే జెర్సీ భిన్న ఎమోషన్స్ ను భేషుగ్గా పండించి అటు క్రిటిక్స్ ను, ఇటు ప్రేక్షకులను మెప్పించాడు.

ఇప్పుడు హిందీ జెర్సీలో షాహిద్ చేస్తుండడంతో నాని చేసిన పాత్రకు అతను ఎంత వరకూ మ్యాచ్ చేయగలడు అంటూ డిస్కషన్స్ మొదలయ్యాయి. నాని అంటే న్యాచురల్ స్టార్. మరి అంతటి న్యాచురల్ యాక్టింగ్ షాహిద్ చేయగలడా అని అనుమానిస్తున్నారు కొంత మంది. నిజానికి షాహిద్ ఫిట్నెస్ కు సరిగ్గా సరిపోయే కథ జెర్సీ. పైగా క్రికెట్ లో షాహిద్ కు ప్రవేశముంది కూడా. అందుకే జెర్సీ షాహిద్ కు సరిపోతుంది. క్రికెట్ సీన్ల వరకూ ఓకే కానీ ఈ సినిమాకు అత్యంత ముఖ్యమైనది ఎమోషనల్ సీన్స్. వాటిని షాహిద్ కపూర్ మ్యాచ్ చేయగలిగితే మరో తెలుగు సినిమాతో సూపర్ హిట్ అందుకోవడం ఖాయం. తెలుగు వెర్షన్ ను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి హిందీ వెర్షన్ ను కూడా తెరకెక్కించనున్నాడు.

 

View this post on Instagram

 

#jersey the prep begins.

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

Credit: Instagram