సూర్య ఇప్పుడైనా హిట్ కొడతాడా ?

తమిళ స్టార్ హీరో సూర్య తెలుగులో హిట్ కొట్టి చాలాకాలం అవుతోంది . ఒకప్పుడు తెలుగు స్టార్ హీరోలకు పోటీగా భారీ ఓపెనింగ్స్ వచ్చేవి ఈ హీరో చిత్రాలకు కానీ వరుస ప్లాప్ లతో సూర్య చిత్రాలకు గిరాకీ లేకుండాపోయింది . అయితే సూర్య కున్న క్రేజ్ తో ఈ హీరో నటించిన ప్రతీ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తూనే ఉన్నారు . అయితే అవి వచ్చినవి వచ్చినట్లే వెళ్లిపోతున్నాయి .

తాజాగా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ” ఎన్ జీకే ” . సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రేపు భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు . తెలుగు , తమిళ బాషలలో విడుదల అవుతున్న ఈ చిత్రంపై సూర్య ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . ఇక తెలుగులో ఈ సినిమా దాదాపు 9 కోట్ల షేర్ వసూల్ చేయగలగాలి అప్పుడే ఈ సినిమాని కొన్న వాళ్ళు సేఫ్ అవుతారు . 9 కోట్ల షేర్ అంటే దాదాపు 20 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాలి . మరి సూర్య ఆ వసూళ్ల ని సాధిస్తాడా ? హిట్ కొడతాడా ?