సూర్య రాజకీయాల్లోకి రానున్నాడా ?


Suriya
Suriya

తమిళ స్టార్ హీరో సూర్య రాజకీయాల్లోకి రానున్నాడా ? ప్రస్తతం తమిళనాట జరుగుతున్న చర్చ ఇదే ! నీట్ పరీక్షా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విధానాలు సరైన దిశలో లేవని సూర్య విమర్శించడం సంచలనంగా మారింది . పేద , మధ్య తరగతి పిల్లలకు కూడా అవకాశం ఉండాలనేది సూర్య అభిమతం కానీ అవన్నీ పట్టించుకోకుండా కొంతమంది హీరో సూర్య ని టార్గెట్ చేసి పెద్ద ఎత్తున విమర్శలు చేసారు .

దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన సూర్య ఓ లేఖ విడుదల చేసాడు కానీ రాజకీయాల మీద మాత్రం చర్చ సాగిందట ! అయితే ఇప్పట్లో మాత్రం సూర్య రాజకీయాల్లోకి వచ్చేలా లేడు కానీ ప్రజల గురించి నిత్యం ఆలోచించే సూర్య భవిష్యత్ లో మాత్రం తప్పకుండా రాజకీయాలలోకి రావడం ఖాయమని అంటున్నారు .