త్రివిక్రమ్ రిపీట్ చేస్తాడా? కొత్త కాంబినేషన్ సెట్ చేస్తాడా?


త్రివిక్రమ్ రిపీట్ చేస్తాడా? కొత్త కాంబినేషన్ సెట్ చేస్తాడా?
త్రివిక్రమ్ రిపీట్ చేస్తాడా? కొత్త కాంబినేషన్ సెట్ చేస్తాడా?

ఎంత కంఫర్ట్ అనిపించినా కూడా మళ్ళీ మళ్ళీ అవే కాంబినేషన్స్ సెట్ చేసుకోవడానికి ఏ దర్శకుడూ, హీరో కూడా అంతలా ఇష్టపడరు. రిపిటీషన్ వస్తుందన్న ఉద్దేశంతో కొత్త కాంబినేషన్స్ కోసం చూస్తుంటారు. అయితే త్రివిక్రమ్ మాత్రం అలాంటివేం పట్టించుకోడు. తనకు కంఫర్ట్ అనిపిస్తే పనిచేసిన వాళ్ళతోనే మళ్ళీ మళ్ళీ చేయడానికి చూస్తుంటాడు. కెరీర్ మొదట్లోనే మహేష్ బాబుతో రెండు సినిమాలు చేసేసాడు త్రివిక్రమ్. తర్వాత పవన్ కళ్యాణ్ తో మూడు సినిమాలు చేసాడు. రీసెంట్ గా అల వైకుంఠపురములో చిత్రంతో కలుపుకుంటే అల్లు అర్జున్ తో కూడా మూడు సినిమాలు చేసాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో రెండోసారి చేయడానికి సిద్ధమవుతున్నాడు.

హీరోయిన్ల విషయంలో కూడా త్రివిక్రమ్ ఇలానే రిపీట్ చేస్తుంటాడు. ఇలియానాతో రెండు సినిమాలు చేసిన త్రివిక్రమ్, సమంతతో అయితే మూడు సినిమాలు చేసాడు. ఇక పూజ హెగ్డే తో రెండు వరస సినిమాలు చేసాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా కోసం ఏ హీరోయిన్ ను తీసుకోవాలన్న చర్చ నడుస్తోంది. త్రివిక్రమ్ మరోసారి పూజ హెగ్డేకు ఓటు వేయాలని భావిస్తున్నాడు. అలాగే దీనివల్ల అరవింద కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందన్న భావన కలుగుతుందేమోనని కూడా ఆలోచిస్తున్నాడు. అందుకే లేటెస్ట్ హిట్ సెన్సేషన్ రష్మికను తీసుకునే ఆలోచన కూడా చేస్తున్నాడు. వీరిద్దరిలో ఒకరు హీరోయిన్ గా నటించే.అవకాశాలున్నాయి. మరి త్రివిక్రమ్ హీరోయిన్ ను రిపీట్ చేస్తాడో లేక కొత్త కాంబినేషన్ వైపు మొగ్గు చూపుతాడో చూడాలి.

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ మే నుండి మొదలవ్వనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఇందులో కొమరం భీం పాత్ర పోషిస్తున్నాడు.