ఉప్పెన క్లైమాక్స్ పైనే అందరి కళ్ళు!

ఉప్పెన క్లైమాక్స్ పైనే అందరి కళ్ళు!
ఉప్పెన క్లైమాక్స్ పైనే అందరి కళ్ళు!

మరో మెగా హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన చిత్రం ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలే ఉన్నాయి. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ప్రోమోలతో అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. ఉప్పెన విషయంలో బజ్ కూడా చాలా పాజిటివ్ గా ఉంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ పైనే బోలెడన్ని రూమర్లు షికార్లు చేస్తున్నాయి. ఉప్పెన క్లైమాక్స్ చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంటుందని, దాన్ని జీర్ణించుకోవడం కొంచెం కష్టమేనని తెలుస్తోంది.

అయితే ఈ రూమర్లలో నిజమెంతుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్తలు దూసుకుపోతున్నాయి. ఉప్పెన క్లైమాక్స్ కనుక ప్రేక్షకులను మెప్పించగలిగితే సినిమా సూపర్ హిట్ అవ్వడం గ్యారంటీ అని అందరూ అంటున్నారు. మరి చూడాలి ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న ఉప్పెన క్లైమాక్స్ ఎలా ఉండబోతోందో.