విజయ్ దేవరకొండ నోటా తో హిట్ కొడతాడా?


Will vijay devarakonda get succes with NOTA

గీత గోవిందం చిత్రంతో సంచలన విజయం సాధించిన విజయ్ దేవరకొండ తాజాగా నోటా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గీత గోవిందం చిత్రం యాభై రోజులను పూర్తిచేసుకున్న తర్వాత నోటా తో రావడం విశేషం. ఇక గీత గోవిందం చిత్ర విషయానికి వస్తే రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా దానికి పూర్తి భిన్నంగా నోటా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కడం విశేషం. గీత గోవిందం తో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆ సక్సెస్ ని నోటా తో కంటిన్యూ చేస్తాడా ? హిట్ కొడతాడా ? ఇప్పుడు అందరి ముందు తొలుస్తున్న ప్రశ్న ఇదే! విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ తో భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం . ఇక టాక్ బాగుంటే సక్సెస్ లేదంటే షరా మాములే!

నేను తెలంగాణ వాసిని అని నోట విజయవాడ ఫంక్షన్ లో వాళ్ళ అక్కకు చెప్పాడు, అక్క చూడు నాకు ఆంధ్రాలో కూడా ఫాలోయింగ్ ఉందని. వరుస హిట్స్ తో “ద్వారకా” సినిమా గురించి మర్చి పోయినట్లు వున్నాడు. తెలుగు , తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన నోటా చిత్రంని తెలంగాణలో విడుదల కాకుండా చూడాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసారు కూడా . కానీ ఎన్నికల కమిషన్ ఎటువంటి ఆంక్షలు విధించలేదు. దాంతో నోటా చిత్రం రేపు తెలుగు , తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల అవుతోంది. ఇక అమెరికాలో ముందుగానే ప్రీమియర్ షోలు పడనున్నాయి. విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి గా అలరిస్తాడా ? లేదా ? రేపే తేలిపోనుంది.

English Title: Will vijay devarakonda get succes with NOTA