విజయ్ దేవరకొండ హిట్ కొడతాడా


will vijay devarakonda gets another success with geetha govindamఅర్జున్ రెడ్డి చిత్రంతో ప్రభంజనం సృష్టించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత మహానటి చిత్రంతో మరో క్లాసికల్ హిట్ కొట్టాడు అయితే మధ్యలో వచ్చిన ” ఏ మంత్రం వేసావే ”, ” ఈ నగరానికి ఏమైంది ” చిత్రాలు ప్లాప్ అయ్యాయి . ఏ మంత్రం వేసావే సినిమా అసలు వచ్చినట్లే తెలీదు ఎందుకంటే విజయ్ దేవరకొండ ఆ సినిమా కోసం ప్రమోషన్ చేయలేదు , ఇక టాక్సీ వాలా అయితే ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ అది వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది రెండు నెలలుగా ఇంకా ఎప్పుడు విడుదల అవుతుందో తెలీదు .

తాజాగా గీత గోవిందం చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఆగస్టు 15 న గీత గోవిందం విడుదల కానుంది . రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించగా పరశురామ్ దర్శకత్వం వహించాడు . ఆగస్టు 9న నితిన్ నటించిన శ్రీనివాస కళ్యాణం విడుదల అవుతోంది . కుటుంబసమేతంగా చూడతగ్గ చిత్రంగా అప్పుడే ఆ సినిమాకు పేరొచ్చింది . ఇక విడుదల కావడమే ఆలస్యం హిట్ గ్యారెంటీ అని వినిపిస్తోంది . మరి ఆ వారం తర్వాత ఆగస్టు 15న విడుదలయ్యే గీత గోవిందం తో విజయ్ దేవరకొండ హిట్ కొడతాడా ? అన్నది చూడాలి . రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన గీత గోవిందం పై విజయ్ దేవరకొండ చాలా ఆశలే పెట్టుకున్నాడు మరి .

English Title: will vijay devarakonda gets another success with geetha govindam